Andhra Pradesh: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల శ్వాస..ఇచ్చే వరకూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటాం: సీఎం జగన్
- మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం
- ‘నవరత్నాలు’తో అన్ని వర్గాలకు న్యాయం
- అన్ని పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటిస్తాం
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల శ్వాస అని, ‘హోదా’ ఇచ్చే వరకూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఓ మాట, ఆ తర్వాత మరో మాట చెప్పడం తమ విధానం కాదని అన్నారు. నీతివంతమైన పాలన అందిస్తేనే రాష్టం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నీతివంతమైన పరిపాలన అందించాలనే సీఎంగా ప్రమాణం చేశానని, దేశ చరిత్రలోనే అత్యున్నత సామాజిక మంత్రి మండలిని ఏర్పాటు చేశామని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, సీఎం, మంత్రుల ఛాంబర్లలో మేనిఫెస్టో ప్రతులు కనిపించేలా ఉంచామని చెప్పారు. ‘నవరత్నాలు’తో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. పారదర్శకమైన టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశామని, జడ్జి అనుమతితో టెండర్లకు వెళ్లే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని అన్నారు.