Australia: వరల్డ్ కప్ లో తొలిసారి టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్

  • ఐదు సార్లు టాస్ ఓడిన ఫించ్
  • ఆరో పర్యాయం టాస్ విన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ వరల్డ్ కప్ లో ఎట్టకేలకు ఓ టాస్ గెలిచాడు. వరుసగా ఐదు మ్యాచ్ ల్లోనూ టాస్ ఓడిన ఆసీస్ సారథి ఇవాళ నాటింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ నెగ్గడం విశేషం. కాగా టాస్ నెగ్గిన కంగారూ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో అగ్రశ్రేణి జట్లు సైతం ఛేజింగ్ చేయడానికి ఆపసోపాలు పడుతున్నాయి. దాంతో ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఎలాంటి సాహసానికి పోకుండా టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ కు మొగ్గుచూపాడు.

గాయం కారణంగా కొన్నిమ్యాచ్ లకు దూరమైన కీలకమైన ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ పునరాగమనం చేయడం ఆసీస్ జట్టును మరింత బలోపేతం చేస్తోంది. ఇక బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీలో ఆడుతున్న తీరు చూస్తుంటే సెమీఫైనల్ బెర్తు ఖాయమనిపిస్తోందని క్రికెట్ పండితులంటున్నారు. ముఖ్యంగా, ఆ జట్టులోని సీనియర్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఐపీఎల్ లో కనీసం జట్టులో స్థానానికి కూడా నోచుకోని షకీబల్ వరల్డ్ కప్ లో మాత్రం చిచ్చరపిడుగల్లే చెలరేగిపోతున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ తనదైన శైలిలో రాణిస్తూ జట్టుకు అండగా మారాడు.

అయితే గణాంకాలు ఆసీస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు వన్డేల్లో బంగ్లాదేశ్ పై 18 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది.

  • Loading...

More Telugu News