sirivennela: వేటూరిగారి వల్లనే నేను పాటల వైపు పరిగెత్తాను: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
- వేటూరి పాటలు నన్ను ఆలోచింపజేశాయి
- నాకు స్ఫూర్తి వేటూరిగారే
- ఆయనంటే పరిపూర్ణమైన గౌరవం
తెలుగు సినిమా పాటకు మరింతగా సాహిత్య పరిమళాలను అద్ది, అనుభూతుల ఆకాశంలో ఎగరేసిన గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "తెలుగు సినిమా పాటకి కావ్యరూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి వేటూరిగారేనని చెప్పాలి. ఆత్రేయగారి ప్రయత్నం కూడా వుంది .. కాకపోతే అది కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది.
వేటూరిగారు వస్తూనే ప్రతిపాటలోను ఏదో ఒక అద్భుతత్వాన్ని ఆవిష్కరించేయడం మొదలుపెట్టారు. ఆ పాటలు నన్ను ఆశ్చర్యపరిచేవి .. ఆలోచింపజేసేవి. ఆయన పాటలు విన్న తరువాత, కాకినాడలో వున్న నాకు 'నేను రాయగలను కదా' అనిపించింది. అలా ఆయన నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పట్ల నాకు పరిపూర్ణమైన గౌరవం వుంది .. నా పట్ల ఆయనకి విపరీతమైన వాత్సల్యం ఉండేది" అని చెప్పుకొచ్చారు.