Australia: భీకర ఫామ్ కొనసాగిస్తున్న వార్నర్... ఖాతాలో మరో శతకం

  • ఈ వరల్డ్ కప్ లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఓపెనర్
  • బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా ఆసీస్
  • 38 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 230 పరుగుల స్కోరు

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన డేవిడ్ వార్నర్ మునుపటి కంటే కసిగా ఆడుతున్నాడు. ఇటీవలి ఐపీఎల్ లో బౌలర్లకు సింహస్వప్నంలా మారిన ఈ ఆసీస్ ఆటగాడు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో కూడా పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో లీగ్ మ్యాచ్ లో ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ సెంచరీ సాధించాడు. ఈ వరల్డ్ కప్ లో వార్నర్ కు ఇది రెండో శతకం. ఇప్పటికే మరో రెండు అర్ధసెంచరీలు కూడా వార్నర్ ఖాతాలో ఉన్నాయి.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, నాటింగ్ హామ్ పిచ్ పై ఎలాంటి తడబాటు లేకుండా ఆడిన వార్నర్ 110 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. అంతకుముందు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడి 53 పరుగులు చేశాడు. ప్రసుత్తం వార్నర్ 119, ఉస్మాన్ ఖవాజా 50 పరుగులతో ఆడుతున్నారు. 38 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 230 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News