Priyanka Gandhi: ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది?: యూపీ సర్కారుపై ప్రియాంక గాంధీ ఫైర్
- ఇంకెప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది?
- దుండగుల దుశ్చర్యలకు అమాయకులు బలవుతున్నారు
- మనుషులను బతికుండగానే తగులబెడుతున్నారు
ఉత్తరప్రదేశ్ లో అరాచకం ప్రబలిపోతోందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కిరాతకులు దారుణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మహిళలు భద్రత కోల్పోయారు. మనుషులను బతికుండగానే తగులబెడుతున్నారు. దుండగుల దుశ్చర్యలకు అమాయకులు బలవుతున్నారు. ఇంకెప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది? మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?" అంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా యూపీలో అత్యాచారాలు, హత్యాకాండలు ప్రబలిపోయాయి. చిన్నారులపైనా అత్యాచార ఘటనలు పెరిగిపోతుండడం పట్ల ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు.