Andhra Pradesh: ప్రధాని మోదీతో సుజనా, టీజీ, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ భేటీ!

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమావేశం
  • ఏపీలో బీజేపీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • నలుగురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరు టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరారు. తాజాగా ఈ నలుగురు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మోదీ నివాసానికి వెళ్లిన నేతలు, ప్రధానితో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, బీజేపీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఈ నలుగురు నేతలకు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరి చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 75కు చేరుకుంది.

  • Loading...

More Telugu News