India: మిడిల్ ఓవర్లలో ఆఫ్ఘన్ ను దెబ్బకొట్టిన బుమ్రా
- ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- కుదుపులకు లోనైన ఆఫ్ఘన్ ఇన్నింగ్స్
- ఆఫ్ఘన్ స్కోరు 29 ఓవర్లలో 4 వికెట్లకు 106
టీమిండియాతో సౌతాంప్టన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో 225 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ ను మిడిల్ ఓవర్లలో బుమ్రా దెబ్బదీశాడు. 28 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 106 పరుగులతో ఆడుతున్న దశలో బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. క్రీజులో నిలదొక్కుకున్న రహ్మత్ షా (36), హస్మతుల్లా షాహిదీ (21)లను అవుట్ చేశాడు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ 29 ఓవర్లలో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు గెలవాలంటే 21 ఓవర్లలో 119 పరుగులు చేయాలి.