rajasekhar: 'దొరసాని' మంచి ప్రేమకథా చిత్రమవుతుంది: హీరో రాజశేఖర్
- 'దొరసాని' కథలో విషయం ఉంటుంది
- హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది
- ఈ సినిమాతో శివాత్మిక పరిచయం ఆనందంగా ఉందన్న రాజశేఖర్
రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని' సినిమా నిర్మితమైంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.
'దొరసాని' సినిమా మంచి ప్రేమకథ. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తుండటం, యశ్ రంగినేని - మధుర శ్రీధర్ వంటివారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టే ఈ కథలో విషయం ఉంటుందనేది అర్థమవుతుంది. సాంగ్స్ ను బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండ .. శివాత్మిక మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇంత చక్కని ప్రేమకథా చిత్రం ద్వారా శివాత్మిక పరిచయమవుతుండటం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.