sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 71 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతం పైగా నష్టపోయిన ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ నాటి ట్రేడింగ్ లో ముఖ్యంగా మెటల్స్, ఆటోమొబైల్స్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 39,122కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11,699 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (2.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.31%), టీసీఎస్ (1.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.09%), ఐటీసీ (0.75%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.48%), టాటా స్టీల్ (-2.33%), వేదాంత లిమిటెడ్ (-2.23%), బజాజ్ ఆటో (-1.97%), టెక్ మహీంద్రా (-1.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.29%).