Bangladesh: ఆసక్తికరంగా సాగుతున్న బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • షకీబ్, ముష్ఫికర్ అర్ధసెంచరీలు
  • బంగ్లా దూకుడుకు కళ్లెం వేసిన ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ రెహ్మాన్

సౌతాంప్టన్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ప్రేక్షకులను అలరించేలా సాగుతోంది. ఈ పోరులో ఆఫ్ఘన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ప్రత్యర్థి బౌలింగ్ పై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించింది. అయితే, మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు పడడంతో బంగ్లా జోరుకు బ్రేకులు పడ్డాయి.

ముఖ్యంగా, ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ ముజబుర్ రెహ్మాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 39 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. క్రీజులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ 61, మహ్మదుల్లా 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 36 పరుగులు చేయగా, ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 61 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News