Bangladesh: బంగ్లాదేశ్ ను 262 పరుగులకు కట్టడి చేసిన ఆఫ్ఘనిస్థాన్

  • టాస్ గెలిచిన ఆఫ్ఘన్
  • రాణించిన రెహ్మాన్, నయిబ్
  • ముష్ఫికర్, షకీబ్ అర్ధసెంచరీలు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న క్రికెట్ వరల్డ్ కప్ లో 300 పరుగుల స్కోర్లు అలవోకగా నమోదవుతున్న తరుణంలో, ఆఫ్ఘనిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ ను 262/7 పరుగులకే కట్టడి చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ ఆఫ్ఘన్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ ను ఇబ్బందులకు గురిచేశారు. ముఖ్యంగా యువ ఆఫ్ స్పిన్నర్ ముజబుర్ రెహ్మాన్ (10-0-39-3) అద్భుతమైన స్పెల్ తో బంగ్లా బ్యాటింగ్ ను దెబ్బతీశాడు. కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ కూడా 2 వికెట్లతో రాణించాడు.

ఇక, బంగ్లాదేశ్ బ్యాటింగ్ విషయానికొస్తే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్ సమయోచితంగా ఆడి 83 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షకీబ్ 51 పరుగులతో తన ఫామ్ చాటుకున్నాడు. చివర్లో మొసద్దీక్ (24 బంతుల్లో 35) ధాటిగా ఆడడంతో బంగ్లా స్కోరు 250 పరుగులు దాటింది.

  • Loading...

More Telugu News