Pervaram Ramulu: మాజీ డీజీపీ పేర్వారం రాములుపై వారెంట్ జారీ
- 2001లో అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని అరెస్ట్ చేయించిన పేర్వారం
- పరువునష్టం దావా వేసిన మాధవరెడ్డి
- మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు
మాజీ డీజీపీ పేర్వారం రాములు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు వారెంట్ జారీ అయింది. 2001లో ఓ భూకబ్జా కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని సీపీ హోదాలో ఉన్న పేర్వారం రాములు అరెస్ట్ చేయించారు. దానిపై మాధవరెడ్డి పరువునష్టం దావా వేయగా, 2017లో మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని కోర్టు పేర్వారం రాములును ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా పేర్వారంపై వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది.