gudipudi srihari: ఎన్టీ రామారావు పస్తులున్న రోజులున్నాయి: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి
- కాలేజ్ రోజుల్లో ఎన్టీఆర్ నాటకాలు వేసేవారు
- సినిమాల్లో అవకాశాల కోసం తిరిగారు
- 'పాతాళభైరవి'తో ఎన్టీఆర్ దశ తిరిగిందన్న గుడిపూడి శ్రీహరి
సీనియర్ జర్నలిస్ట్ గా .. సినీ విమర్శకుడిగా .. విశ్లేషకుడిగా గుడిపూడి శ్రీహరికి మంచి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు. "విజయవాడ కాలేజ్ లో ఎన్టీ రామారావుగారు నా కంటే సీనియర్. కాలేజ్ రోజుల్లోనే ఆయన నాటకాలు వేసేవారు. అలా అప్పట్లోనే ఆయన ప్రత్యేకంగా చూడబడేవారు.
ఆ తరువాత సినిమాల పట్ల ఆసక్తితో ఆయన చెన్నైకి వచ్చారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకోవడం ఇష్టం లేక, ఒకానొక దశలో రెండు మూడు రోజులుపాటు పస్తులున్నారు. ఆయనే ఈ విషయం నాకు స్వయంగా చెప్పారు. 'పాతాళ భైరవి' తరువాత ఎన్టీఆర్ కి స్టార్ డమ్ అందుకుంది. అదే సినిమాతో ఎస్వీ రంగారావుగారికి కూడా మంచి పేరు వచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.