Low Preasure: ఆదివారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- రెండు రోజుల పాటు వర్షాలు
- తుపానుగా మారే చాన్స్
ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరుగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం జూలై తొలి వారంలో కనిపిస్తుందని వెల్లడించారు.