ukraine: ఉక్రెయిన్ లో ఆందోళనకు దిగిన భారత విద్యార్థులు
- మెడికల్ వర్సిటీలపై నిరసన
- శాపంగా పరిణమించిన ఐ-ఫామ్ నిబంధన
- ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ముందు ఆందోళన
వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ కు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. బొగమలెట్స్, కీవ్ మెడికల్ వర్సిటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఐ-ఫామ్ పేరిట ఇటీవల కొత్త నిబంధనలు వచ్చాయి. ఈ నిబంధనలు మన విద్యార్థులకు శాపంగా పరిణమించాయి. ఇక్కడ చదువుతున్నవారిని ఇంటికి పంపేందుకే ఈ నిబంధనలు తెచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో... ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ఎదుట భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరోవైపు, విద్యార్థుల పాట్లపై కన్సల్టెన్సీలు స్పందించడం లేదు.