Sri Lanka: విజృంభించిన దక్షిణాఫ్రికా పేసర్లు... శ్రీలంక టాపార్డర్ విఫలం

  • 111 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • నిప్పులు చెరిగిన ప్రిటోరియస్, మోరిస్, రబాడా
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీలు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. చెస్టర్ లీ స్ట్రీట్ లో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ కరుణరత్నే అవుట్ కావడంతో స్టేడియంలో ఉన్న లంక అభిమానులు కోలుకోవడానికి కొంత సమయం పట్టింది.

ఇక కుశాల్ పెరెరా, ఆవిష్క ఫెర్నాండో చెరో 30 పరుగులు చేసినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. మెండిస్ (23), మాథ్యూస్ (11) కూడా దక్షిణాఫ్రికా పేస్ అటాక్ ముందు నిలవలేకపోయారు. దాంతో ఆ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.  దక్షిణాఫ్రికా పేసర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో లంకను దెబ్బతీశాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 29 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు కాగా, డిసిల్వా, జీవన్ క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News