telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్న అల్పపీడనం
- వాయుగుండంగా మారే అవకాశం
- వచ్చే నెల 2 నుంచి భారీ వర్షాలు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తర బంగాళాఖాతంలో రేపు ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.