Mahindra Group Chairman: జస్ట్ రూ.2తో ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచనకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా
- నా వాట్సాప్ ఎన్నో విషయాలతో నిండి ఉంటుంది
- సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తుంటా
- హైడ్రాలిక్ పరికరం ఖర్చు రూ.1500
తలుపు దానంతట అదే మూసుకునే హైడ్రాలిక్ పరికరం అమర్చుకోవాలంటే సుమారు రూ.1500 ఖర్చు అవుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం కేవలం రూ.2తో తలుపు మూసే వినూత్న ఐడియాను కనిపెట్టి ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించాడు. ప్లాస్టిక్ బాటిల్తో ఆ వ్యక్తి చేసిన ఆలోచనను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది.
తన వాట్సాప్ ఎన్నో ఉపయోగపడే విషయాలతో నిండి ఉంటుందని, అయితే తాను మాత్రం నిత్య జీవితంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే వాటిపైనే దృష్టి సారిస్తుంటానని తెలిపారు. తలుపు మూసేందుకు కావాల్సిన హైడ్రాలిక్ పరికరం ఖర్చు రూ.1500 ఉండగా, ఈ వ్యక్తి మాత్రం కేవలం రూ.2తో పరిష్కారాన్ని కనిపెట్టాడని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా కొనియాడారు.