Dog: కుక్క కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలికి వైద్యుడి తలతిక్క సలహా!
- వెళ్లి కుక్కను కరవాలంటూ అసందర్భ వ్యాఖ్య
- దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు
- ఎస్సీఎస్టీ కేసు పెడతానంటూ డాక్టర్ బెదిరింపులు
రాజస్థాన్ లోని అజ్మీర్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఓ మహిళ కుక్క కరిచిందంటూ స్థానిక వైద్యశాలకు వెళ్లింది. అయితే, అక్కడి వైద్యుడి ప్రవర్తనతో బాధితురాలు దిగ్భ్రాంతికి గురైంది. కుక్క కరిచిన బాధ కంటే వైద్యుడి తలతిక్క సలహా ఆమెను మరింత బాధించింది. "కుక్క కరిచిందా? అయితే నువ్వెళ్లి ఆ కుక్కను కరువు" అంటూ సదరు వైద్యుడు అసందర్భ ప్రేలాపనలు చేశాడు.
"ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?" అంటూ ప్రశ్నించిన బాధితురాలిపై ఆ డాక్టర్ ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటూ బెదిరించాడు. తాను ఆసుపత్రికి రావడమే తొలిసారని, అలాంటప్పుడు ఆ డాక్టర్ ఏ కులానికి చెందినవాడో తనకెలా తెలుస్తుందని ఆ మహిళ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.