Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... నేటి నుంచి భారీ వర్షాలకు అవకాశం!
- ఉత్తర బంగాళాఖాతంలో లో ప్రజర్
- మంగళవారం నాటికి వాయుగుండంగా మారే చాన్స్
- 5 రోజుల పాటు వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుందని, మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని ఆయన అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత ఇదే తొలి అల్పపీడనం కావడంతో, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఖరీఫ్ లో ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతాంగం, ఈ సీజన్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.