babli project: సుప్రీం ఆదేశాలననుసరించి.. నాలుగు నెలల పాటు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
- తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో తెరుచుకోనున్న గేట్లు
- ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు దిగువకు నీరు
- ప్రస్తుతం నీరు లేక ఖాళీగా ఉన్న బాబ్లీ
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఆ రాష్ట్ర అధికారులు నేడు తెరవనున్నారు. ఈరోజు నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లను తెరిచి ఉంచుతారు. గేట్లు తెరిచే కార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర జలసంఘం అధికారులు కూడా హాజరుకానున్నారు. బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిందంటూ సుప్రీంకోర్టును అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలల పాటు గేట్లను తెరిచి ఉంచాలని ఆదేశించింది. మరోవైపు బాబ్లీ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో... గేట్లు తెరిచినా కిందకు నీరు రాని పరిస్థితి నెలకొంది.