sensex: బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉంటాయనే అంచనాలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- రెండు రోజుల నష్టాలకు బ్రేక్
- 292 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 77 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల నష్టాలకు ఈరోజు తెరపడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో... దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన కీలక ప్రకటనలు చేస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 39,687కి పెరిగింది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 11,866కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.23%), బజాజ్ ఆటో (3.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.64%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.60%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.99%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.43%), మారుతి సుజుకి (-0.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.44%). ఏసియన్ పెయింట్స్ (-0.26%).