Bay Of Bengal: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... రేపు వాయుగుండంగా మారే అవకాశం!
- వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు
- తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రేపటి కల్లా మరింత బలపడుతుందని, వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్ డీఆర్ఎఫ్ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఏర్పడిన కారణంగా మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లినవాళ్లు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ఏర్పడితే సముద్రతీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.