yogi adityanath: అవినీతి అధికారుల భరతం పడుతున్న యోగి ఆదిత్యనాథ్!

  • అవినీతి ఉద్యోగులపై కొరడా ఝుళిపించిన యోగి
  • కఠిన చర్యలు ఎదుర్కొంటారంటూ 400 మందికి నోటీసులు
  • స్వచ్ఛందంగా రిటైర్ కావాలని 200 మందికి నోటీసులు

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం 600 మందిపై ఆయన ఉక్కుపాదం మోపారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వీరిలో 400 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 200 మందికి ముందస్తు ఉద్యోగ విరమణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 200 మంది స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని ఇప్పటికే నోటీసులు పంపారు. మరోవైపు, అవినీతి ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్న యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News