sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత
- 23 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు శుక్రవారం నాడు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 39,839కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,917 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.79%), ఐటీసీ (1.08%), ఎల్ అండ్ టీ (0.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.59%), ఏసియన్ పెయింట్స్ (0.53%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.44%), వేదాంత లిమిటెడ్ (-1.32%), ఇన్ఫోసిస్ (-1.14%), యస్ బ్యాంక్ (-1.04%), టాటా మోటార్స్ (-0.82%).