jagan: కొత్త ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించిన జగన్
- తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష
- పలువురు మంత్రులు, అధికారులు హాజరు
- సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న సీఎం
నూతన ఇసుక విధానంపై మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన విధానం వల్ల ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్తోందని జగన్ భావిస్తున్నారు. ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే వచ్చేలా నూతన ఇసుక విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇసుక విధానంపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన మంత్రులు, అధికారులు ఈ సమీక్షలో జగన్ కు వివరిస్తున్నారు. అనంతరం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.