Pakistan: లైవ్ లో బట్టబయలైన పాకిస్థాన్ యాంకరమ్మ అజ్ఞానం!

  • డిబేట్ లో తప్పులో కాలేసిన లేడీ యాంకర్
  • యాపిల్ టెక్ కంపెనీ బిజినెస్ ను యాపిల్ పండ్ల వ్యాపారంగా భావించిన వైనం
  • సరిదిద్దిన నిపుణుడు

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాకిస్థానీలు ట్రోల్ కావడం బాగా ఎక్కువైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంతటివాడే విషయ పరిజ్ఞానంలేని వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ అవుతుండగా లేనిది మాకేం తక్కువైందని ఇతరులు భావిస్తున్నట్టుంది. పాకిస్థాన్ లో ఓ టీవీ యాంకర్ కూడా ఇదే రీతిలో తన అజ్ఞానం బయటపెట్టుకుంది.

ఓ టీవీ చానల్ లో చర్చా కార్యక్రమం జరుగుతుండగా, డిబేట్ కు హాజరైన ఓ నిపుణుడు మాట్లాడుతూ, "పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ కంటే యాపిల్ వ్యాపార విలువే ఎక్కువగా ఉంటుంది" అన్నాడు. ఆయన మాట్లాడింది ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ను ఉద్దేశించి. కానీ, ఆ లేడీ యాంకర్ మాత్రం, "అవునండీ, యాపిల్స్ లో ఎన్నో రకాలున్నాయి, అది చాలా పెద్ద వ్యాపారం సుమండీ!" అంటూ తనకు తోచిన రీతిలో చెప్పుకొచ్చింది.

ఆ యాంకర్ బుద్ధి మాంద్యాన్ని ఇట్టే పసిగట్టిన ఆ నిపుణుడు, "కాదమ్మా, నేను చెప్పింది యాపిల్ టెక్నాలజీ కంపెనీ గురించి, యాపిల్ పండు గురించి కాదు" అంటూ ఆమె తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారని వేరే చెప్పాలా! పాపం, ఆ యాంకర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకున్నారు.

  • Loading...

More Telugu News