satyam babu: ఓ ఇంటివాడైన సత్యంబాబు.. ఖమ్మం జిల్లా యువతితో వివాహం
- ఆయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్ల జైలు శిక్ష
- నిర్దోషిగా బయటపడిన వైనం
- నిరాడంబరంగా వివాహం
ఆయేషా మీరా హత్యకేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు ఓ ఇంటివాడయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన యువతిని ఈ నెల 4న పెళ్లాడాడు. నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సత్యంబాబుకు ఇది రెండో వివాహం. గతంలో మరదలితో అతడికి వివాహం జరిగింది. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత హత్యకేసులో చిక్కుకున్న సత్యంబాబు తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.