Telugudesam: చంద్రబాబు కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి దూరం.. క్లారిటీ ఇచ్చిన జిల్లా ఉపాధ్యక్షుడు
- అందుబాటులో లేని కారణంగానే చంద్రబాబు కార్యక్రమానికి హాజరు కాలేదు
- టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడను
- కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి ఆయన హాజరుకాలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ కరీముల్లా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అందుబాటులో లేని కారణంగానే చంద్రబాబు కార్యక్రమానికి ప్రత్తిపాటి హాజరు కాలేకపోయారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సాకుగా తీసుకుని కొందరు దుష్ప్రచారానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ప్రత్తిపాటి వీడరని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైసీపీ దాడులను తిప్పికొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.