KCR: కూల్చివేతలకు కేసీఆర్ మారుపేరుగా నిలిచారు: కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా
- స్వయం ప్రకటిత రాజులా వ్యవహరిస్తున్నారు
- 4వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు
- మరో 2వేల పాఠశాలలను మూసివేసేందుకు యత్నిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. పేదల విద్య గురించి కేసీఆర్ ఆలోచించడం లేదని ఆయన మండిపడ్డారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 4 వేల ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ ప్రభుత్వం మూసివేయించిందని... మరో 2వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కూల్చివేతలు, మూసివేతలకు కేసీఆర్ మారుపేరుగా నిలిచారని అన్నారు. సెక్రటేరియట్ నుంచి విద్య వరకు అన్నింటినీ కూల్చివేస్తున్నారని చెప్పారు. స్వయం ప్రకటిత రాజుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.