Inter students: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై...హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు

  • పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
  • పిటిషన్‌ దాఖలు చేసిన ఉన్నత విద్యా విభాగం మాజీ డైరెక్టర్‌
  • విచారించిన జస్టిస్‌ బాబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాలు వెలువడిన అనంతరం కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపధ్యంలో ఫలితాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్థించింది. పిటిషన్‌ను ఎపెక్స్‌ కోర్టు కూడా కొట్టేసింది. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఇది విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిందని, ఈ అంశాలపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని ఉన్నత విద్యా విభాగం మాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో పిటిషనర్‌ సుప్రీం కోర్టు తలుపుతట్టారు. ఎపెక్స్‌ కోర్టులో జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు పిటిషన్‌పై విచారణపై జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థనీయమేనంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

  • Loading...

More Telugu News