USA: అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- మీ యురేనియం శుద్ధి ఎందుకో నాకు తెలుసు
- కారణాలు ఇప్పుడు చెప్పను
- మీ పద్ధతి సరిగాలేదు
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అణు ఒప్పందాన్ని తాము అనుసరించడంలేదని ఇరాన్ ప్రకటించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇరాన్ ను ఘాటుగా హెచ్చరించారు. న్యూజెర్సీలో మీడియాతో మాట్లాడుతూ "ఇరాన్, మీ యురేనియం శుద్ధి కార్యక్రమం వెనుకున్న ఉద్దేశాలేంటో నాకు తెలుసు. అవేంటనేది ఇప్పుడు చెప్పను. కానీ, మీ పద్ధతి బాగాలేదు, జాగ్రత్త!" అంటూ హెచ్చరించారు. అటు, అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో కూడా ఇదే తరహాలో స్పందించారు. అణు ఒప్పందానికి తూట్లు పొడిచేలా ఇరాన్ వ్యవహరిస్తే, తాము మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు.