mumbai: ముంబైని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

  • వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికిపైగా మృతి
  • నేటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు
  • 50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్న అలలు

గతంలో ఎన్నడూ లేనంతంగా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఆర్థిక రాజధాని అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో రెండు రోజులు తెరిపినిచ్చిన వానలు సోమవారం మళ్లీ మొదలయ్యాయి. దీంతో జనజీవనం మరోమారు స్తంభించింది. కాగా, నేడు ముంబై, దక్షిణ కొంకణ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలెర్ట్ జారీ  చేసింది.

రయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో నేటి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కెరటాలు 40-50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్నట్టు పేర్కొంది. శుక్రవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించింది.

  • Loading...

More Telugu News