S.P.Charan: అలా అనుకోకుండా సింగర్ ని అయ్యాను: ఎస్.పి.చరణ్
- చెన్నైలో చదువుపై దృష్టిపెట్టలేదు
- అమెరికాలో చదువు పూర్తిచేశాను
- ఇళయరాజా గారు తొలిపాట పాడించారన్న ఎస్.పి. చరణ్
తెలుగులో ఎస్.పి.చరణ్ పాడిన కొన్ని పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. ఆయన స్వరం బాలు స్వరానికి దగ్గరగా ఉంటుందని అంతా అంటూ వుంటారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎస్.పి.చరణ్ మాట్లాడుతూ, తను ఎలా సింగర్ అయ్యింది ప్రస్తావించాడు.
"చెన్నైలోని దాదాపు అన్ని స్కూళ్లలో చదివేశాను. అయినా నాకు చదువెక్కడం లేదని చెప్పేసి అమెరికా పంపించేశారు. అక్కడ చదువు పూర్తిచేసుకుని వచ్చాను. ఓ రోజున కారు డ్రైవర్ రాకపోవడంతో, నాన్నను తీసుకురావడానికి ఏవీయం జి థియేటర్ కి వెళ్లాను. అప్పుడు నాన్న ఇళయరాజా స్వరకల్పనలో ఒక పాట పాడుతున్నారు. వాళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. నేను బాలూగారి అబ్బాయినని తెలిసి ఇళయరాజా గారు నాతో ఒక పాట పాడించారు. అలా అనుకోకుండా సింగర్ ని అయ్యాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.