Saravana Bhavan: ఆక్సిజన్ మాస్క్‌తో అంబులెన్స్‌లో వచ్చి లొంగిపోయిన శరవణ భవన్ రాజగోపాల్
- 2001లో తన ఉద్యోగిని హత్య చేసిన రాజగోపాల్
- యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు
- సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
హత్య కేసులో జీవిత శిక్ష పడిన శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి.రాజగోపాల్ మంగళవారం ఆక్సిజన్ మాస్క్‌తో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. తనకు విధించిన జీవిత ఖైదును ఆలస్యంగా ప్రారంభించాల్సిందిగా ఆయన చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చడంతో కోర్టులో లొంగక తప్పలేదు. దీంతో ఆయన ఆక్సిజన్ మాస్క్‌తో, అంబులెన్స్‌లో వచ్చి చెన్నై సెషన్స్ కోర్టులో లొంగిపోయాడు.
2001లో తన దగ్గర పనిచేసే ఉద్యోగి శాంతకుమార్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో 72 ఏళ్ల రాజగోపాల్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో 8 మందిని 2004లో దోషులుగా తేల్చిన కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. పదేళ్ల జైలు శిక్షను కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే, శిక్షను ఆలస్యంగా ప్రారంభించాలన్న ఆయన అభ్యర్థనను సుంప్రీం కోర్టు కూడా తిరస్కరించడంతో మంగళవారం ఆయన లొంగిపోయాడు.