High Court: ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
- శరవేగంగా నియామక ప్రక్రియ
- రేపటి నుంచే ఇంటర్వ్యూలు
- ఆగస్ట్ 15 నుంచి విధుల్లోకి తీసుకోవాలని ప్రణాళిక
గ్రామ వాలంటీర్లను కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం సరికాదంటూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం నియామక ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.
రేపటి నుంచి గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 1న అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ శిక్షణ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఆగస్ట్ 15న విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇదే సమయంలో పిటిషన్ దాఖలవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ రేపే జరిగే అవకాశం ఉంది.