Andhra Pradesh: రైతులకు పెద్దపీట... ఏపీ బడ్జెట్ లో కేటాయింపులివి!
- ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఆర్థికమంత్రి బుగ్గన రైతుల సంక్షేమానికి పెద్ద పీటను వేశారు. వైఎస్ఆర్ రైతు భరోసాకు భారీగా నిధులను కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు, సాగునీరు, వరద నివారణకు అధిక కేటాయింపులు జరిపారు. ఈ బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి బుగ్గన చేసిన ప్రతిపాదనలివి.
* ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
* ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2,002 కోట్లు
* వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు
* రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రూ. 4,525 కోట్లు
* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
* గ్రామాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 29,329 కోట్లు
* సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు
* వైఎస్ఆర్ రైతు బీమాకు రూ. 1,163 కోట్లు
* రైతులు ఉచిత బోర్లు వేసుకునేందుకు రూ. 200 కోట్లు
* విత్తనాల పంపిణీకి రూ. 200 కోట్లు