CPI: మేం తలచుకుంటే టీడీపీవాళ్లు ఒక్కరు కూడా ఉండరన్న జగన్ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ ఫైర్
- జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన నారాయణ
- 23 మంది శాసనసభ్యులకే రక్షణ లేదు
- అంతకన్నా తక్కువున్న పార్టీల సంగతేంటి?
నిన్నటి ఏపీ శాసనసభ సమావేశాల్లో తన ప్రసంగానికి అడ్డు వస్తున్న టీడీపీ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, తాము 150 మంది ఉన్నామని... మేం తలుచుకుంటే సభలో ఒక్క టీడీపీ సభ్యుడు కూడా ఉండడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వివిధ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. సీపీఐ నారాయణ కూడా ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
'మేము 151 మంది సభ్యులున్నాం. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అత్యున్నత శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. 23 మంది శాసనసభ్యులకే రక్షణ లేకపోతే... అంతకన్నా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్షాలపై చట్టసభల్లో అప్రకటిత నిషేధమేనా?' అంటూ నారాయణ విమర్శించారు.