Ayesha Meera: 12 ఏళ్ల తర్వాత ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం చేయనున్న సీబీఐ
- ఆయేషా తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టులు నిర్వహించిన సీబీఐ
- ఆయేషాకు టెస్టు చేయడానికి నిరాకరించిన మత పెద్దలు
- కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకున్న సీబీఐ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ, తమకు కూడా సీబీఐ డీఎన్ఏ టెస్టులను నిర్వహించిందని చెప్పారు. ఆయేషాకు డీఎన్ఏ టెస్టు చేయడానికి మత పెద్దలు ఒప్పుకోలేదని... అయితే, కోర్టు ద్వారా సీబీఐ అనుమతులు తెచ్చుకుందని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామని చెప్పారు. తమకు సీబీఐ కూడా న్యాయం చేయకపోతే... ప్రజలు ఇక ఏ వ్యవస్థనూ నమ్మరని అన్నారు.