New Zealand: 42 ఓవర్లలో కివీస్ స్కోరు 186/5... భారీస్కోరు సాధించేనా?
- టాస్ గెలిచిన న్యూజిలాండ్
- భారీస్కోర్లు సాధించడంలో విఫలమైన బ్యాట్స్ మెన్
- 3 వికెట్లతో కివీస్ ను దెబ్బతీసిన ప్లంకెట్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లో నేడు ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టైటిల్ కోసం ఆడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ప్రణాళిక ప్రకారం ఆడడంలో విఫలమైంది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఆశించిన రీతిలో వ్యక్తిగత భారీ స్కోర్లు నమోదుచేయలేకపోయారు. ఓపెనర్ గప్టిల్ 19 పరుగులు చేయగా, స్టార్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. నీషామ్ 19 పరుగులు చేసి నిరాశపరిచాడు. 42 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోరు 5 వికెట్లకు 186 పరుగులు కాగా, ఓపెనర్ హెన్రీ నికోల్స్ (55), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లీష్ బౌలర్లలో ప్లంకెట్ 3 వికెట్లు తీసి కివీస్ టాపార్డర్ ను దెబ్బతీశాడు.