China: దలైలామా విషయంలో భారత్ కు హెచ్చరికలు చేసిన చైనా
- దలైలామా వారసుడి ఎంపికపై చైనా మంత్రి వ్యాఖ్యలు
- భావి దలైలామాను చైనా గడ్డ నుంచే ఎన్నుకోవాలంటూ స్పష్టీకరణ
- ప్రస్తుత దలైలామాపై విమర్శలు
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా విషయంలో భారత్ కు చైనా మరోసారి హెచ్చరికలు చేసింది. దలైలామా వారసుడ్ని చైనా భూభాగం నుంచే ఎన్నుకోవాలని, ఈ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుంటే ఇరుదేశాల మధ్య సంబంధాలు మునుపటిలా ఉండవని చైనా స్పష్టం చేసింది. దీనిపై చైనా మంత్రి వాంగ్ మాట్లాడుతూ, దలైలామా టిబెట్ యువతను తన స్వార్థ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకున్నారంటూ మండిపడ్డారు. దలైలామా వారసుడు, దలైలామా పునర్జన్మ అంశం ప్రస్తుతం ఉన్న దలైలామా వ్యక్తిగత వ్యవహారం ఎంతమాత్రం కాదని, విదేశాల్లో ఉన్న మరికొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారాన్ని ప్రభావితం చేయలేరని వాంగ్ పేర్కొన్నారు. కాగా, గత ఆరు దశాబ్దాలుగా దలైలామా భారత్ లో రాజకీయ ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.