Karnataka: కర్ణాటక రాజకీయాలు.. ఈ నెల 18న విధాన సభలో బలపరీక్ష
- అవిశ్వాస తీర్మానం నోటీసు ప్రవేశపెట్టిన బీజేపీ
- ఉదయం పదకొండు గంటలకు బలపరీక్ష
- ఆధిక్యత నిరూపించుకునే వరకూ సభ నిర్వహించొద్దన్న బీజేపీ నేతలు
కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పక్షానికి కొంత సమయం ఇస్తున్నామని, ఈ నెల 18న ఉదయం పదకొండు గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, విధాన సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును బీజేపీ నేత జేసీ మధుస్వామి ప్రవేశపెట్టారు. సభలో ఆధిక్యత నిరూపించుకునేంత వరకూ సభ నిర్వహించవద్దని స్పీకర్ ను కోరారు. ఒకవేళ సభ నిర్వహిస్తే వాకౌట్ చేస్తామని స్పీకర్ కు స్పష్టం చేశారు. కర్ణాటక విధాన సభను గురువారం వరకు స్పీకర్ వాయిదా వేశారు.