Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా
- గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కల్రాజ్
- వయసు పైబడడంతో మధ్యలోనే తప్పుకున్న నేత
- మరో మూడు నెలల్లో ముగియనున్న పది రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా (78)ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్గా బదిలీ కావడంతో ఆ స్థానంలో కల్రాజ్ను నియమించింది. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మిశ్రా వయసు పైబడడంతో 2017లో తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. మరో మూడు నెలల్లో పది రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్ను నియమించడంతో ఈ ప్రక్రియ ప్రారంభించింది.