Vijay Sai Reddy: అమరావతిలో కుంభకోణాన్ని వరల్డ్ బ్యాంక్ గుర్తించింది: విజయసాయి రెడ్డి
- అమరావతి ఓ స్కామ్ ల పుట్ట
- రియల్ ఎస్టేట్ కు మేలు చేసేదిగా ఉంది
- అందుకే రుణాన్ని నిలిపేసిందని వెల్లడి
అమరావతిలో నిర్మాణాల పేరిట భారీ కుంభకోణాలు జరిగినట్టు ప్రపంచ బ్యాంకు గుర్తించిందని, అందువల్లే ఇస్తామన్న రుణాన్ని ఇచ్చేందుకు నిరాకరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "అమరావతి ఒక స్కామ్ ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసింది. రియల్ ఎస్టేట్ కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైంది" అని అన్నారు.