Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 305 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 73 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో, సూచీలు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు పతనమై 38,031కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,346కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (9.49%), వేదాంత లిమిటెడ్ (3.85%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.52%), ఏషియన్ పెయింట్స్ (2.49%), మారుతి సుజుకి (2.48%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.32%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.26%), బజాజ్ ఫైనాన్స్ (-2.21%).