Gali Janardhan reddy: నా ఆస్తుల అప్పగింతలో ఈడీ జాప్యాన్ని వీడకుంటే సుప్రీంను ఆశ్రయిస్తా: గాలి జనార్దన్‌రెడ్డి
- ఈడీ ఎదుట విచారణకు హాజరైన జనార్దన్‌రెడ్డి
- నా ఆస్తులను అప్పగించాలని హైకోర్టు తీర్పిచ్చింది
- హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు.
విచారణానంతరం గాలి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను తనకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, ఈ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం సైతం సమర్థించిందన్నారు. తన ఆస్తుల విడుదలలో ఈడీ జాప్యాన్ని వీడకుంటే న్యాయం కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.