Chandrayaan-2: చీకట్లో చంద్రయాన్-2ను చూసి గ్రహశకలం దూసుకొస్తోందని భయపడిన ఆస్ట్రేలియన్లు!

  • సోమవారం చంద్రయాన్-2ను ప్రయోగించిన భారత్  
  • ఆస్ట్రేలియా గగనతలంపై చీకట్లను చీల్చుతూ వెళ్లిన రాకెట్  
  • ఉదయం పేపర్లలో చూసి చంద్రయాన్-2 అని తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రజలు

భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడించిన ప్రతిష్ఠాత్మక ప్రాజక్టు చంద్రయాన్-2. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2ని మోసుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ నింగికెగిసింది. అయితే, అదే సమయంలో ఆస్ట్రేలియాలో రాత్రివేళ కావడంతో చంద్రయాన్-2 అక్కడి గగనతలంలో వెలుగులు చిమ్ముతూ ప్రయాణించడం కనిపించింది. అది చంద్రయాన్-2 అని తెలియని ఆస్ట్రేలియన్లు ఓ వెలుగు విపరీతమైన వేగంతో దూసుకెళ్లడం చూసి ఏదో గ్రహశకలం వస్తోందనుకుని భయాందోళనలకు లోనయ్యారు.

చీకటి కారణంగా రాకెట్ మిగతా భాగం కనిపించకపోవడం, బూస్టర్ల నుంచి వెలువడుతున్న జ్వాలలు భీకరంగా ఉండడంతో ఆస్ట్రేలియా వాసులు రకరకాల ఊహాగానాలు చేశారు. గ్రహాంతరవాసుల నౌక అని, గ్రహశకలం అని పుకార్లు పుట్టించారు. చివరికి అది భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 అని ఉదయం దినపత్రికల్లో చూసిందాకా వారికి తెలియలేదు.

  • Loading...

More Telugu News