Ram Charan: చెర్రీ బాగానే ఉన్నాడు.. గాయాలేమీ కాలేదు: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం

  • మరోసారి గాయపడ్డాడంటూ జోరుగా ప్రచారం
  • రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’
  • చెర్రీతో పాటు నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్

షూటింగులో భాగంగా కథానాయకుడు రామ్ చరణ్ మరోసారి గాయపడ్డాడని ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో ఉన్న చెర్రీ గతంలో చిత్రీకరణలో భాగంగా కాలికి గాయమైంది. అయితే నేడు ఆయన ఓ సన్నివేశం ప్రాక్టీస్ సందర్భంగా ప్రమాదవశాత్తు మరోసారి గాయపడ్డాడని కొన్ని వెబ్‌సైట్లు వార్తా కథనాలను రాశాయి.

దీంతో చిత్రబృందం ఈ వార్తలపై స్పందించింది. చెర్రీ ఆరోగ్యం చాలా బాగుందని, ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం స్పష్టం చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీతో పాటు మరో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. 2020 జులై 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

  • Loading...

More Telugu News