Amit Shah: ఉగ్రవాదంతో సంబంధాలున్న ఎవరినైనా టెర్రరిస్టుగా ప్రకటించే బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
  • బిల్లుకు అనుకూలంగా 284 ఓట్లు
  • బిల్లును వ్యతిరేకించిన ఎనిమిది మంది ఎంపీలు

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (సవరణ) నియంత్రణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 284 మంది ఎంపీలు ఓటు వేయగా... ఎనిమిది మంది వ్యతిరేకించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే... ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్న ఏ వ్యక్తినైనా టెర్రరిస్టుగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది.

బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఎవరినైనా టెర్రరిస్టుగా ప్రకటించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితితో పాటు చైనా, ఇజ్రాయల్, పాకిస్థాన్, యూరోపియన్ యూనియన్లకు ఒక ప్రొసిజర్ ఉందని తెలిపారు. ఏదైనా ఉగ్ర సంస్థను నిషేధించినప్పుడు... వెంటనే వారు మరొక సంస్థను స్థాపిస్తున్నారని చెప్పారు.

అనేక మంది సోషల్ యాక్టివిస్టులు మంచి పనులు చేస్తున్నారని... అయితే, ఆ ముసుగులో ఉండే అర్బన్ మావోయిస్టులపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని అమిత్ షా అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా... టెర్రరిజంపై ఆ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిందేనని చెప్పారు.

  • Loading...

More Telugu News