Rahul Bose: రెండు అరటిపండ్లకు రూ.442 వసూలు చేసిన హోటల్‌పై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
- షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లిన రాహుల్
- అరటి పండ్ల ఉదంతాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి
- స్పందించిన ఛండీఘర్ డిప్యూటీ కమిషనర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ బోస్కి షాకిచ్చిన ఫైవ్ స్టార్ హోటల్ జేడబ్ల్యూ మారియట్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది. షూటింగ్ కోసం ఛండీఘడ్ వెళ్లిన రాహుల్ ఈ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. తాను జిమ్‌కి వెళ్లొచ్చిన అనంతరం తినేందుకు ఆయన రెండు అరటి పండ్లు ఆర్డర్ చేశారు. అరటి పండ్లను తెచ్చి ఇచ్చిన హోటల్ సిబ్బంది, వాటికి బిల్ మాత్రం రూ.442 వసూలు చేసింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా రాహుల్ వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ ట్వీట్ విపరీతంగా వైరల్ అవడంతో ఛండీఘడ్ డిప్యూటీ కమిషనర్ అండ్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ కమిషనర్ మణిదీప్ సింగ్ బ్రార్ దీనిపై స్పందించారు. రెండు అరటి పండ్లకు అత్యధిక ధరతో పాటు జీఎస్టీని వసూలు చేసిన హోటల్ మారియట్‌పై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇది రుజువైతే హోటల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మణిదీప్‌సింగ్ హెచ్చరించారు.